30, ఏప్రిల్ 2013, మంగళవారం

నేను రచయితని కానన్న వారిని రాయెట్టి కొడతాను.

చాలు .. ఇంక చాలు ... 
ఛత్రపతి లో ప్రభాస్'కు లా నా రక్తం ఉడికి పోతోంది... 
ఇంకా ఎన్నాళ్లు .... 
వేరే యెవరెవరో గొట్టం గాళ్ళు(రచయితలు, రచయిత్రినిలు అందరు కూడా పెద్ద మనస్సు చేసుకొని క్షమించాలి, మీకు తెలియంది కాదు, అంతరాత్మ బాష కు మర్యాదలు తెలియవు) రాసినది నేను చదవడం. 
ఏం నా బ్రతుకులో  కబుర్లు లేవా, సంగతులు లేవా, అనుభవాలు లేవా, సంఘర్షణ లేదా, స్పందించే హృదయం లేదా .. రాయడానికి పెన్ను లేదా(ఇక్కడ టైపు కొట్టడానికి వేళ్ళు లేవా అని చదువుకోవాలి), రాసేందుకు సమయం (తెలుగు లో time )  లేదా, అన్నీ వున్నాయ్....  
చివరాకరిదయిన సమయం అయితే, గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కు వున్న పొగరంత వుంది. 
సరే, ఇవన్నీ ఉన్న నేను రాయకుండా వుండటం పాఠక లోకానికి ఇన్నాళ్ళు చేసిన అన్యాయం గా బావించి, ఇన్నాళ్ళు పాఠకులకు  నేను చేసిన ద్రోహానికి నాలో నేనే సిగ్గు పడుతూ, పాఠక దేవుళ్ళని మనస్పూర్తిగా మన్నించమని వేడుకొంటూ.. నేను కూడా రాయడం మొదలు పెట్టాలని నిర్నయించుకొన్నానని అందరికీ సవినయంగా తెలియ చేసుకొంటున్నాను..
ఇంక కాస్కోండి,  ఇక నేను కూడా మిమ్మల్ని కపాడలేను....
అవును నేను రచయిత ను అయిపోయాను..... నేను రచయితని కానన్న వారిని రాయెట్టి కొడతాను :) 

3 కామెంట్‌లు:

  1. ha ha... rayetthi kottakandi...laptop keyboard kottandi chaalu :) gud one...looks like even you are new to blogging world like me...All the best...write more in telugu..:)

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములండి, మీకు కూడా All the best అండి.

    రిప్లయితొలగించండి
  3. aahaa..

    Mana Dialogue Masteru 'Rao Gopala Rao' gaari maatallo cheppalantey:

    "Blog chusaanu, Chaala santoshamga vundhi..

    Vaari Tassarao la boddu..Maanchi capacity vunna abbayi blog modalettadayya.. ika chudu, yela chinchi chinchi chiragesthaado..."

    - A die-hard fan of Chiran's samayaspurthi & writing skills :)

    రిప్లయితొలగించండి