ఒక నిర్ణయం తీసుకోవడం జరిగి పోయింది. కానీ సమాధానం దొరకవలసిన ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయ్. తెలంగాణ ప్రాంతానికి కొత్త రాష్ట్రం, ఆంద్ర ప్రాంతానికి పోలవరం ప్రాజెక్ట్ ప్రకటించేశారు, బాగుంది, మరి రాయలసీమ ప్రాంతానికి ఏమి ప్రకటిస్తారో. బహుశా కేబినెట్ మీటింగ్ తరువాత ప్రకటిస్తారేమో . నా అనుమానం రాయలసీమ ప్రాంతానికి విసన కర్రలు సబ్సిడీ రేట్ కి సరఫరా చేస్తామని ప్రకటిస్తారేమో. అసలే ఉక్క ప్రాంతం కాబట్టి, రెండు రోజులు నిరసన తెలిపి అలసిపోయి వేడి తట్టుకోలేక విసన కర్రలు తీసుకొని విసురుకొంటూ వెల్లిపోతారు.
మొత్తానికి నిర్ణయం తీసుకొన్న సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపడం ప్రతి ఒక్క తెలుగు వాడి బాధ్యత. నా అనుమానం సోనియా గాంధీ గారికి పూర్వ జన్మలో యెవరో ఒక తెలుగు వాడు భరించలేని అన్యాయం చెసుంటాడు, దానికి ప్రతీకారం ఆవిడ ఈ జన్మలో ఇలా తెలుగు జాతి మొత్తం మీద తీర్చుకొంటున్నారు.
ఇక పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని నిర్ణయం వుంది చూసారూ. ఇది తెలుగు మీడియా కి సోనియా గాంధి గారు అందించిన వరం. ఇద్దరు ముఖ్య మంత్రులు, ఇద్దరు గవెర్నెర్లు, ఇద్దరు హోం మినిస్టర్లు. ఇలా ప్రతీ దానికి ఇద్దరేసి. దాన్ని నుంచి పుట్టే తమాషా ఇబ్బందులు , సచివాలయం లోని గదులు పంచుకోవడాలు, సీట్లు ఆక్రమించుకోవడాలు(ఈ పీరియడ్'లో హైదరాబాద్ లో kerchief ల బిజినెస్ బాగా వర్కౌట్ అయ్యే అవకాశం వుంది), దాని నుంచి పుట్టే గొడవలు, విడతల వారీగా అసెంబ్లీ సమావేశాలు. ఆహ, ఇది ఓ పది సంవత్సరాలు పాటు మొత్తం తెలుగు మీడియాకి పూర్తిగా పని కల్పించే ఒక మహత్తరమయిన ప్రాజెక్ట్. బహుశా ఇప్పుడున్న తెలుగు ఛానల్'స్ కి కనీసం ఇంకో 50 కొత్త తెలుగు ఛానల్'స్ పుడతాయి.
ఇక పోతే తెలంగాణా తో పాటు ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉంది.
- తెలంగాణ డిమాండ్ 56 సంవత్సరాలుగా ఉంది అని శ్రీ డిగ్గీ గారు శెలవిచ్చారు. ఆ విధం గా చూస్తే కాశ్మీర్ డిమాండ్ 60 సంవత్సరాలుగా ఉంది. కాబట్టి కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చేయాలి.
- పాపం తమిళ్ వాళ్ళు వేరు దేశం కావాలని స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఆశ పడుతున్నారు. కాబట్టి తమిళ్ నాడు ని భారత దేశం నుంచి వేరు చేసి, దాన్ని మన మిత్ర దేశం గా ప్రకటించాలి.
- చైనా వాళ్ళు అరుణాచల్ప్రదేశ్ తమదేనని ఎన్నాలుగానో పోరుతున్నారు. అరుణాచల్ప్రదేశ్ మాత్రమే ఎందుకు, అస్సాం, త్రిపుర, మిజోరాం, సిక్కిం ఇలా మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాలు చైనా కి ఇచ్చేయాలి. ఊరకే ఎందుకు మనకు భారం.
- గుజరాత్ తో సోనియా గారికి యెప్పుడూ పడదు కాబట్టి, గుజరాత్ ని భారత దేశం నుంచి వేరు చేసి దాన్ని మన శత్రు దేశం గ ప్రకటించాలి.
- పశ్చిమ బెంగాల్ ని బంగ్లాదేశ్ కి ఇచ్చేయాలి.
- చివరాకరి గ 'India should be handed over to Italy' అనే నినాదం తో ఇటలీ లో ఒక ఉద్యయం ప్రారంబింపచేసి, మిగిలి వున్న భారత దేశాన్ని ఎంత వీలయితే అంత త్వరగా ఇటలీ కి ఇచ్చేసి , సోనియా గాంధి గారు 'ఇటలీ రత్న' అని బిరుదు అందుకోవాలి.
తెలంగాణ బిల్ కంటే ముందు , ఈ నిర్ణయాల బిల్ పాస్ చేయించే అవకాశం ఏమయినా వుందా చూడాలి.
ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందని ఆశగా ఎదురు చూస్తూ
-- ఒక తెలుగు వాడు.
(బ్యాక్ గ్రౌండ్ సాంగ్ : ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమయిన గారడీ చేస్తున్నావు, తమాషా చూస్తున్నావు.... )